పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
► ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్‌తో భావితరాలకు మేలు
► పనులను పరిశీలించిన కలెక్టర్ కరుణ
రాయపర్తి : ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్ర భుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లి, గన్నారం గ్రా మాల్లో ఇంకుడుగుంతలు, ఫాం పాండ్ నిర్మాణాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు నీటి ఇబ్బందులు తీరాలంటే ప్రతీ ఒక్కరు తమ గృహాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ భూముల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని ఆమె సూ చించారు.
ఆ తర్వాత ఆమె ఉపాధి హామీ కూ లీలతో మాట్లాడుతూ పనుల నిర్వహణ మెళకువలు పాటించాలన్నారు. ఇదేక్రమంలో తీవ్ర మైన ఎండలు ఉన్నందున వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పిటీసీ సభ్యురాలు వంగాల యాకమ్మ, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీఓ శంకరి, టీఆర్‌ఎస్ నాయకుడు జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు వశపాక కుమారస్వామి, బెల్లి యాదమ్మ, వశపాక మారయ్య పాల్గొన్నారు.