
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్-హైదరాబాద్ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంకొండ వద్ద పట్టాలపై ట్రాక్‌మిషన్ ఒరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేవరకద్ర మండలం కౌకుంట్ల వద్ద గుంటూరు ప్యాసింజర్, దేవరకద్ర వద్ద తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు నాలుగు గంటలుగా అవస్థలు పడుతున్నారు. అయితే ట్రాక్‌ను క్లియర్ చేయడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ రూట్లో నడిచే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.