
శోభ వర్సెస్ శోభ
కరీంనగర్ జిల్లాలో ప్రజా ప్రతినిధుల మధ్య గొడవలు ముదురుతున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, మల్యాల జడ్పీటీసీ సభ్యురాలు శోభ నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను ఇప్పటికే జడ్పీటీసీలు, అధికారులతో సమావేశం నిర్వహించానని ఎమ్మెల్యే శోభ చెప్పడంతో, అసలు సమావేశం పెట్టలేదని ఎమ్మెల్యే తప్పు చెబుతున్నారంటూ జడ్పీటీసీ సభ్యురాలు శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘ఈమె కాంగ్రెస్... పిలిస్తే మీటింగ్‌కు రాదన్నా..’ అంటూ హరీష్‌రావుకు చెప్పారు. అసలు మీటింగ్ పెట్టలేదు, నాకు చెప్పలేదంటూ జడ్పీటీసీ సభ్యురాలు శోభ వాదనకు దిగారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు లేవడంతో సభ పక్కదారిపట్టే ప్రమాదం ఉందని భావించిన మంత్రులు హరీష్, ఈటెల రాజేందర్, చైర్‌పర్సన్ తుల ఉమ ఇరువురిని వారించారు.