- అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన లైన్ సర్వేను ఈనెలాఖరు కల్లా పూర్తి చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) విభాగం క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడేందుకు ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని సోమవారం ఆయన ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్ల కార్యాలయాల్లోని అధికారులతో మంత్రి మాట్లాడారు. భవిష్యత్తులో వాటర్‌గ్రిడ్ పనులు జరిగే 40 ప్రాంతాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయానికి అనుసంధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయి అధికారులతో పాటు కేంద్ర కార్యాలయంలోని అధికారులతో మంత్రి వాటర్‌గ్రిడ్ పనులపై సుదీర్ఘం సమీక్షించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.