ఫాంహౌస్‌లో సీఎం సంక్రాంతి సంబురాలు | Siem phanhaus wallpapers samburalu | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో సీఎం సంక్రాంతి సంబురాలు

Published Sat, Jan 17 2015 1:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఫాంహౌస్‌లో సీఎం సంక్రాంతి సంబురాలు - Sakshi

ఫాంహౌస్‌లో సీఎం సంక్రాంతి సంబురాలు

జగదేవ్‌పూర్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన కుటుంబ సభ్యులతో కలసి ఫాంహౌస్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల ఫాంహౌస్‌కు కేసీఆర్, తన సతీమణి, మనవ డు, మనవరాళ్లతో వచ్చిన విషయం విదితమే. అదేరోజు సాయంత్రం మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కూడా వచ్చారు. గురువారం వీరంతా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఫాంహౌస్‌కు వచ్చి కేసీఆర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ తన కుమారుడుతో కలసి గాలిపటాలు ఎగురవేశారు. వ్యవసాయ క్షేత్రంలో పర్యటించిన సీఎం పంటలను గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, సంక్రాంతి సందర్భంగా సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఆ అవకాశం దక్కకపోవడంతో వెనుదిరిగారు.
 
నేడు దూలపల్లికి కేసీఆర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లాలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీని సందర్శించున్నారు. రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావే శాన్ని సీఎం అక్కడే నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ అటవీశాఖ అధికారిక లోగోను ఆవిష్కరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement