సోషల్ మీడియాలో ‘సాక్షి‘ కథనం హల్‌చల్
* సిద్దిపేట నీటి పథకంపై సర్వత్ర చర్చ
* పరిశీలించిన మంత్రి హరీష్
సిద్దిపేట అర్బన్: సిద్దిపేటకే తలమాణికం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ప్రపంచ వ్యాప్తంగా తిరిగింది. 15 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో నెలకొన్న తాగునీటి సమస్య, ఆ తర్వాత శాశ్వత మంచినీటి పథకాలతో కేసీఆర్, హరీష్‌రావుల కృషితో ప్రతిరోజూ మంచినీటి సరఫరా నేపథ్యాన్ని వివరిస్తూ రూపొం దించిన కథనం ఇక్కడ చర్చనీయాంశమైంది.
గులాబీ శ్రేణులు ఈ సమగ్ర ‘సాక్షి’ కథనాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎంతోమంది ఫేస్‌బుక్‌లో ఈ కథనాన్ని షేర్ చేసుకున్నారు. విభిన్న ప్రాంతాల వారు ఈ వార్తపై ఆసక్తిని కనబరిచారు. మంత్రి హరీష్‌రావు ఈ వార్తను ఫేస్‌బుక్‌లో చూసి సోమవారం సిద్దిపేట పర్యటనలో భాగంగా సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తను మాజీ మున్సిపల్ మున్సిపల్ రాజనర్సు, శేషుకుమార్‌ల ద్వారా తెప్పించుకొని పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పత్రికలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల మిగతా వారికి స్ఫూర్తిగా నిలవడంతోపాటు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మున్ముందు కూడా ప్రభుత్వం ప్రజలకు కోసం ప్రవేశపెట్టే అభివృద్ధి కార్యక్రమాలను పత్రికలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.