- పేదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతారుు
- పంట నష్టానికి బీమా లేకనే రైతుల ఆత్మహత్యలు
- అన్నదాతలకూ బీమా సౌకర్యం కల్పించాలి
- ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలి
- పార్టీ కార్యకర్తలకూ బీమా వర్తింపజేస్తాం
- వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్ కల్చరల్ : దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రధాని నరేంద్రమోడీ సామాజిక భద్రత పథకాలను (సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్) ప్రవేశపెట్టడం సంతోషకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యో తి బీమా యోజన, అటల్ పింఛన్ యోజన బీమా పథకాలు శనివారం నుంచి అమలులోకి వచ్చారుు. వీటిని జిల్లా కేంద్రంలోని వంశీ హోటల్ సమావేశ మందిరంలో ఎస్‌బీహెచ్ ఆధ్వర్యంలో రాత్రి ఎనిమిది గంటలకు మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రధాని 115 కేంద్రాలలో పేదలను ఆర్థికంగా ఆదుకునే ఈ పథకాలను ప్రవేశపెట్టడం హర్షదాయకమన్నారు. కేవలం ఏడాదికి రూ. 12 రూపాయలు చెల్లిస్తే ప్రధాన మ ంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ. రెండు లక్షల ప్రమాద బీమా, రూ.330 రూపాయల వార్షిక ప్రిమియం చెల్లిస్తే ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథ కం కింద రెండు లక్షల బీమా అందించడం చక్కటి కార్యక్రమమన్నారు. అంతేకాకుండా ఎలాంటి పింఛన్లు పొందనివారి కోసం ప్రత్యేకంగా ఆటల్‌పింఛన్ యోజన పథ కం ప్రవేశ పెట్టడం అభినందనీయమన్నారు.
బీమా లేకపోవడంతోనే రైతు ఆత్మహత్యలు
వ్యక్తులకు, వాహనాలకు ప్రమాదం జరిగినప్పుడు బీమా ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడం జరుగుతోంది కానీ, ఆరుగాలం పండించిన పంటకు నష్టం జరిగినప్పుడు, ప్రీమియం చెల్లించినప్పటికీ బీమా అందించకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 లక్షల మంది రైతులు పంటనష్టంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
వస్తువులకు,వ్యక్తులకు కల్పిస్తున్న బీమా పథకాన్ని ైరె తులు పండించిన పంటకు వర్తింపజేయకపోవడం బాధకర విషయమన్నారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం రైతుల బాధలను గుర్తించి పార్లమెంటులో చట్ట సవరణ చేయవల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికంగా ఆదుకోవా లని ఈపాటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందన్నారు.
50 లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్
టీఆర్‌ఎస్ ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని, జిల్లాలో లక్ష్యానికి మించి 4.70 లక్షల సభ్యత్వ నమోదు జరిగిందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల మంది పార్టీ కార్యకర్తలక రూ.రెండు లక్షల ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం రూ.64లక్షలు పార్టీ తరపున ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సామాజిక భద్రత పథకాలను జిల్లాలో మొట్టమొదటగా తన నియోజకవర్గంలో ప్రారంభిస్తానని ప్రకటించారు.
తన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం పొందిన వారందరికీ ఈ పథకాల ద్వారా బీమా చేయిస్తానన్నారు. అనంతరం లబ్ధిదారులకు బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్, జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, ఎస్‌బీహెచ్ వరంగల్ జనరల్ మేనేజర్ మణికం ఠ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సూర్యప్రకాశ్, మేనేజర్లు సుజాత, ఆంధ్రా బ్యాంకు డీజీఎం మల్లికార్జున్‌రావు, నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ సుభాష్‌చందర్, పా టు ఆయా బ్యాంకు మేనేజర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.