సోలార్ ట్రైసైకిల్
సోలార్ ట్రైసైకిల్ ఎగ్జిబిట్‌ను ప్రయోగాత్మకంగా ప్రదర్శించి అబ్బురపరిచారు మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు పవన్‌కుమార్, పి.సుమేల్. ప్రధానంగా ప్రత్యేక అవసరాల వారికి ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దారు. ట్రైసైకిల్‌కు సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, చార్జింగ్ కంట్రోల్ కోసం డీసీ మోటారు ఉపయోగించారు. పూర్తిగా సోలార్ పవర్‌తోనే నడిచే ఈ ట్రైసైకిల్‌కు ఇంధనం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ బ్యాటరీలకు చేరి వాటిలో నిల్వ ఉంటుంది. తర్వాత ఈ విద్యుత్‌ను మనకు అవసరం ఉన్నప్పుడు వినియోగించుకోవచ్చు.