సమస్యలు పరిష్కరించాలి
మోర్తాడ్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పార్టీలకతీతంగా మోర్తాడ్‌లో జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకులు మాట్లాడుతు రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లించవద్దని ప్రభుత్వం చెబుతుంటే బ్యాంకులు మాత్రం రైతుల నుంచి వడ్డీ సొమ్మును వసూ లు చేస్తున్నాయని తెలిపారు. అంతేకాక గతంలో పంటలకు బీమా ప్రీమి యం చెల్లించినా బీమా వర్తించలేదన్నారు. రుణం తీసుకున్నప్పుడే ప్రీమి యం డబ్బులను తీసుకుని మిగతా మొత్తాన్ని బ్యాంకులు ఇచ్చాయన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బ్యాంకర్ల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుందని అందువల్ల రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరువు మండలంగా ప్రకటించి రైతులకు సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. ఆసమయంలో కమ్మర్‌పల్లి వైపుకు వెళుతున్న ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే స్పందించి బ్యాంకులు రైతుల రుణాలపై వడ్డీ తీసుకోవద్దని ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను పంపిస్తామన్నారు. ఆందోళనలో సత్యనారాయణ, ముత్యంరెడ్డి, రమేష్, మనోహర్‌రెడ్డి, గంగారాం, హన్మాగౌడ్, జైడి గంగారెడ్డి, సామా శ్రీనివాస్ పాల్గొన్నారు.