హైదరాబాద్: ఈ నెల 15న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో జరిగే సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు అందకుంటే ఓయూలోని కార్యాలయాన్ని సంప్రదించాలని సెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. లేదా 040-27097733 నంబర్‌కు ఫోన్ చేసి గాని, settsap@gmail.com వెబ్‌సైట్ ద్వారా తెలియచేసి గాని కొత్త హాల్‌టికెట్‌ను పొందవచ్చని అన్నారు.
రెండు రాష్ట్రాల్లో 27 సబ్జెక్టులకు నిర్వహించే సెట్‌కు 1,35,939 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరికోసం 12 ప్రాంతీయ కేంద్రాలలో 218 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.settsap.org అనే వెబ్‌సైట్ చూడవచ్చు.
‘సెట్ హాల్‌టికెట్లు రాకుంటే సంప్రదించండి’
Published Thu, Feb 12 2015 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM
Advertisement
Advertisement