వికారాబాద్ రూరల్: చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎన్. శుభప్రద్‌పటేల్ పేర్కొన్నారు.
వికారాబాద్ రూరల్: చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎన్. శుభప్రద్‌పటేల్ పేర్కొన్నారు. టీ న్యూస్‌కు ఇచ్చిన లీగల్ నోటీసులకు నిరసనగా శనివారం వికారాబాద్‌లో విలేకరులతో కలిసి ఎన్‌టీఆర్ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహ నం చేశారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓటుకు నోటు కేసులో ప్రధాన ముద్దా యి అయిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాం డ్ చేశారు. నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే చానళ్లకు ఇలా లీగల్ నోటీసులు పంపడం వారి వివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఆంధ్రా పోలీసులను మోహరించడం దారుణమన్నారు. తెలంగాణలో చంద్రబాబు కుట్రలు సాగవన్నారు.
కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ ఇన్‌చార్జి కల్కోడ నర్సిములు, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, టీఆర్‌ఎస్ నాయకులు నర్సిములు, శంకర్, సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, బాలయ్య, బందయ్య, విలేకరులు రుమాండ్ల మఠం గిరీశ్వర స్వామి, రమణ ముదిరాజ్, అశోక్ , నర్సిములు, శివకుమార్, రవి, సంతోష్, శేఖర్, క్రాంతి, కృష్ణచారి, శ్రీధర్, చుక్కయ్య, కటిక నరేష్, ఆనందం, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.