ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కొనుగోలుకు పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ప్రయోగించిన టీడీపీ .....
రేవంత్ ఉదంతంపై పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కొనుగోలుకు పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ప్రయోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ వ్యూహం బెడిసికొట్టడంతో న ష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టారు. దీన్ని రాజకీయ కుట్రగా తిప్పికొట్టాలంటూ నేతలను ఆదేశించారు. రేవంత్ నేరుగా వెళ్లడం పొరపాటన్నారు. టీవీల్లో రేవంత్ డీల్ వీడియో పుటేజ్ చూసి బాబు సహా పసుపు శిబిరం తెల్లబోయింది.
రాజకీయ కుట్రగా అప్పటి వరకు ఆందోళనలు జరిపిన నాయకులు, వీడియోను చూసి నోరు మెదపలేదు. టీవీ ప్రసారాలు చూసిన చంద్రబాబు పార్టీ నాయకులను ఇంటికి పిలిపించి సమాలోచనలు జరిపారు. ‘కామన్‌సెన్స్ ఉన్న ఎవ్వరూ ఇంత అడ్డంగా దొరకరు’ అన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము 2 గంటల వరకు, మళ్లీ సోమవారం ఉదయం ఏడింటికే మరోసారి చర్చలు సాగించారు.