అక్కడలా.. ఇక్కడిలా!
పాఠశాలను తెరిపించిన గ్రామస్తులు
దుగ్గొండి: ఆ ఊరి బడిలో అన్ని సౌకర్యాలూ ఉన్నారుు. కానీ, విద్యార్థులు లేరనే కారణంతో ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ఆ పాఠశాలను మూసేసింది. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలకే తమ పిల్లలను పంపాలని తీర్మానించుకున్న గ్రామస్తులు సోమవారం పాఠశాలను తెరిచారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధిలోని శివాజీనగర్ పాఠశాలలో గతంలో ఐదో తరగతి వరకు చదువు చెప్పేవారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో 11 ఏళ్ల క్రితం మూసేశారు. అరుుతే ఈ విద్యాసంవత్సరంలో గ్రామస్తులంతా ఏకమై 35 మంది విద్యార్థులను ఆ బడిలో చేర్పించారు.
అంతేకాదు సోమవారం బడిని శుభ్రం చేశారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విషయూన్ని జెడ్పీటీసీ సభ్యురాలు సుకినె రజిత ఎంఈవో ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎంఈవో స్పందించి క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ) శ్రీమాతను తాత్కాలికంగా పాఠశాలకు పంపించి తరగతులు నిర్వహించారు. పర్మినెంట్ ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక్కడిలా..
సోమవారం నల్లగొండలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినితో బాత్రూంను శుభ్రం చేయిస్తున్న దృశ్యం