‘స్వైన్’ విహారం | Swine flu cases increase in Nalgonda | Sakshi
Sakshi News home page

‘స్వైన్’ విహారం

Published Sun, Feb 8 2015 3:27 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Swine flu cases  increase in Nalgonda

నల్లగొండ టౌన్ : జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృభిస్తోంది. చలి తీవ్రత అంతగాలేకపోయినా ఉదయం పూట మంచు కురుస్తుండడంతో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో ఇప్పటి వరకు పది స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 రోజుల్లో జిల్లాలో నాలుగు స్వైన్‌ప్లూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బుధవారం తి ప్పర్తి మండలం చిన్నాయిగూడెంకు చెందిన రాజు అనే యువకుడితో పాటు అతని నాలుగేళ్ల కుమారుడు , పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పర్వీన్, మిర్యాలగూడకు చెందిన లక్ష్మి అనే యువతి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
 
 వీరి రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిషిన్) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. వారందరికీ స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అనే రిపోర్ట్ వ చ్చింది. వీరిలో పర్వీన్ అనే యువతి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోం ది. అ లాగే మిగిలిన ముగ్గురు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. అసలు జిల్లాలో ఈ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదంటూ వైద్య ఆరోగ్యశాఖ భరోసా ఇస్తున్నా రోజుకో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసు నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడకు చెందిన ఉద్యోగి   వెంకటగురుప్రసాద్,   నల్లగొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రమేష్‌తో పాటు ఆయన సోదరి శోభారాణి కూడా హైదరాబాద్‌లో మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 19 వరకు అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నప్పటికీ అనేక ప్రాంతాల నుంచి స్వైన్ ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
 
  19 అనుమానిత కేసుల్లో 9మంది పాజిటివ్‌గా తేలింది. ఇందులో ముగ్గురు మృత్యువాత పడగా నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చికిత్సపొంది గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసుల్లో నలుగురు పట్టణానికి చెందిన  వారు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అందులో ఒకే కుటుం బానికి చెందిన రమేష్, శోభారాణి మృతి చెందగా శోభారాణి విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తెలి యకపోవడం విశేషం. తొలుత హైదరాబాద్‌లో మొదలైన స్వైన్‌ఫ్లూ సమీప జిల్లాలకు వ్యాపిస్తోంది. చలికాలంలో వేగంగాస్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. జిల్లా నుంచి  రోజూ వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు హైదరాబాద్ కు రాకపోకలు సాగించడం వ్యాధి వ్యాప్తికి కారణంగా అనుమానిస్తున్నారు.
 
 చిన్నాయిగూడెంలో మరో కేసు..
 తిప్పర్తి మండలం చిన్నాయిగూడెంలో శనివారం మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైనట్లు పీహెచ్‌సీ డాక్టర్ జ్యోతి తెలిపారు. ఐదురోజుల క్రితం ఇదే గ్రామంలో ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకగా అతని కూమారుడికే స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement