పెద్దపల్లిలో తహసీల్దార్‌ బదిలీ కలకలం | Tahsildar transfer in the peddapalli | Sakshi
Sakshi News home page

పెద్దపల్లిలో తహసీల్దార్‌ బదిలీ కలకలం

Published Sun, Aug 6 2017 2:46 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Tahsildar transfer in the peddapalli

- అవినీతి ఆరోపణలపై ఆర్డీవో నివేదిక
సస్పెన్షన్‌కు ఇన్‌చార్జి కలెక్టర్‌ సిఫారసు
ప్రాథమికంగా బదిలీ వేటు
బదిలీ రద్దు చేయాలని ఆర్టీసీ చైర్మన్‌ లేఖ
 
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని తహసీల్దార్‌ గూడూరి శ్రీనివాస్‌రావు బదిలీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రామగుండం తహ శీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై పెద్దపల్లి ఆర్డీవో విచారణ జరిపి.. అవి నిజమని తేల్చారు. దీంతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి రామగుండం తహసీల్దార్‌ గూడూరి శ్రీనివాస్‌రావును సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అతడి అక్రమా లపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే గత నెల 28న శ్రీనివాస్‌రావును ఓదెలకు బదిలీ చేశారు.

అయితే.. ఆయన బదిలీని రెండు నెలల కోసమైనా నిలిపివేయా లని ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. కలెక్టర్‌కు స్వయంగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు అధికంగా ఉండటంతో బదిలీ తప్పదని, ఈ నిర్ణయంలో మార్పు ఉండ బోదని కలెక్టర్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో పెద్దపల్లికి రెగ్యులర్‌ కలెక్టర్‌ను నియమిం చాలని, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావును రామ గుండంలోనే కొనసాగించాలని, ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రొటోకాల్‌ పాటించడం లేదని పేర్కొంటూ ఆర్టీసీ చైర్మన్‌ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్పీ.సింగ్‌కు సోమారపు మూడు వేర్వేరు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. 
 
ఖండించిన జిల్లా అధికారులు
ఇన్‌చార్జి కలెక్టర్‌పై సోమారపు చేసిన ఆరోపణ లను శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధికారులు తీవ్రంగా ఖండించారు. జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకుపోతున్న సమయంలో అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని హితవు పలికారు. మరోవైపు అధికారుల విచారణలో అవినీతి ఆరోపణలు రుజువైన తహసీల్దార్‌ బదిలీ రద్దు చేయాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పట్టుపట్టడం చర్చనీయాంశంగా మారింది. పైగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిన తహసీల్దార్‌కు ప్రజాప్రతినిధులు మద్దతునివ్వడం సరికాదం టున్నారు. రామగుండం తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం ఓదెలలో విధులు నిర్వర్తి స్తున్న శ్రీనివాస్‌రావు రెండు, మూడు రోజుల్లో సస్పెన్షన్‌ అవడం ఖాయమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement