
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు తదితరులు స్వాగతం పలికారు. కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో తమిళిసైతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.