జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ
వరంగల్ : బడుగు, బలహీన వర్గాలకు రాజ కీయ గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. హన్మకొండ బాల సముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీని దెబ్బతీ యాలని ఇందిరాగాంధీ, వైఎస్సార్ ప్రయత్నిం చినా సాధ్యం కాలేదన్నారు. ఉప ఎన్నికలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో ఓడిపోయినంత మా త్రాన పార్టీ పనైపోయిందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు మాట్లాడడం ఆయ న అవివేకానికి నిదర్శనమన్నారు.
రాజకీయ లబ్ధి కోసం నాయకులు పార్టీ మారుతున్నారే తప్ప ప్రజలు టీడీపీ పక్షానే ఉన్నారన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ఇప్పుడు బ్రహ్మరథం పట్టిన వారే భ్రష్టు పట్టిస్తారన్న విషయాలను మరవద్దని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రజల మద్దతుతో పార్టీ మళ్లీ ఉవ్వెత్తున ఎగుస్తుందన్నారు. టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే హక్కులేదని రవీందర్‌రావు అనడం అవివేకమన్నారు. తెలంగాణ కోసం టీడీపీ నుంచి లే ఖ ఇప్పించడం, కేంద్రం జరిపిన చర్చల్లో రేవూ రి తెలంగాణ కోసం మాట్లాడిన విషయాలను ఆయన మరచిపోయారని గండ్ర అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, అర్భన్ అధ్యక్షుడు కక్కె సారయ్య, నేతలు బా లూనాయక్, అశోక్‌కుమార్, బొట్ల శ్రీనివాస్, తాళ్లపెల్లి జయపాల్, బాస్కుల ఈశ్వర్, వడ్నాల నరేందర్, శ్రీరాముల సురేష్, రహీం, మార్గం సారంగం ఉన్నారు.
టీడీపీని భూస్థాపితం చేయడం ఎవరితరం కాదు
Published Mon, Mar 14 2016 1:18 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement