ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డికి సమన్లు జారీ చేయాల్సిందిగా శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు.
కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అడ్వొకేట్ల జేఏసీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు రేవంత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసులు నమోదు చేయాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారు.