పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు మిఠాయి తినిపిస్తున్న కార్యకర్తలు
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈమేరకు ఉపాధ్యాయులు ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో పరిశీలిస్తూ తమ స్థానాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు. ఇంకోపక్క వివిధ ప్రిపరెన్షియల్ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలు సరైనవేనా అని పరిశీలించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక తక్కువ పాయింట్లు వచ్చినా, పూర్తి స్తాయిలో పాయింట్లు రాకపోయినా ఉపాధ్యాయులు అధికారులకు మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. చాలా మంది తమకు నాలుగో కేటగిరీ పాఠశాలలకు సంబంధించి పాయింట్లు కలపలేదని చెబుతుండగా.. స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నా తక్కువ పాయింట్లు కలిపిన నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు వెనక్కి తీసుకుంటున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లో అధికారులు ఉపాధ్యాయులకు నమోదైన పాయింట్ల వివరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment