సీఎస్, డీజీపీ, నగర కమిషనర్లకు ఒకేచోట నివాస భవనాలు | telangana bureaucrats to have quarters in banjara hills | Sakshi
Sakshi News home page

సీఎస్, డీజీపీ, నగర కమిషనర్లకు ఒకేచోట నివాస భవనాలు

Published Fri, Jun 20 2014 12:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

telangana bureaucrats to have quarters in banjara hills

బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మాణం


 సాక్షి,  హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లకు త్వరలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో అధికారిక నివాస భవనాలను ఒకేచోట నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఆమోదం తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ స్థలంలో వీటి నిర్మాణం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్‌కమిషనర్లకు రాజధానిలో ఇప్పటి వరకు అధికారిక నివాసాలు లేవు. ఈ కీలక పోస్టుల్లో ఏ అధికారి ఉన్నా ప్రభుత్వ క్వార్టర్స్‌లలో ఏదో ఒకదానిని కేటాయించేవారు. ఈ విషయమై సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం చర్చించారు. అధికారులు తీసుకువచ్చిన ప్రతిపాదనలను పరిశీలించారు.

 

బంజారాహిల్స్‌లోని మూడెకరాల ప్రభుత్వ స్థలం ఇందుకు అనువుగా ఉంటుంద ని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. దీనిపై హోంవుంత్రి నారుుని నర్సింహారెడ్డితో మాట్లాడిన తరువాత సీఎం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement