షీలా బిడే కమిటీ దృష్టికి తెచ్చిన తెలంగాణ జెన్‌కో
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా రావాల్సి ఉందని షీలా బిడే కమిటీ దృష్టికి తెలంగాణ జెన్‌కో తీసుకువచ్చింది. ప్రభుత్వరంగ సంస్థల విభజనపై ఏర్పడిన ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మాచ్‌ఖండ్, తుంగభద్ర డ్యాం విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇవ్వలేదని టీ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కమిటీకి విన్నవించారు. అదేవిధంగా, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ డ్యాం పవర్‌హౌస్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా.. ఇందులో 300 కోట్ల అప్పును తెలంగాణపై మోపారని సీఎండీ విమర్శించారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు మంగళవారమే ఢిల్లీ వెళ్లారు.
విద్యుత్ ప్రాజెక్టుల్లో మా వాటా ఇప్పించండి
Published Wed, Aug 27 2014 2:27 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement