ఆమే యజమాని! | Telangana government introduced women food security cards | Sakshi
Sakshi News home page

ఆమే యజమాని!

Published Sat, Jan 3 2015 2:53 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

ఆమే యజమాని! - Sakshi

ఆమే యజమాని!

పరిగి: తరతరాల వివక్షకు తెరపడనుంది. పితృస్వామ్య వ్యవస్థలో కొత్తశకం ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా పురుషాధిక్యతయే పరంపరగా సాగిన సమాజంలో మహిళకు సరికొత్త గుర్తింపు దక్కనుంది. కుటుంబ యజమానురాలిగా చరిత్రలో పేరు లిఖించుకోనున్నతరుణీ తరుణం ఆసన్నమైంది. గత ప్రభుత్వాలు పురుషులను కుటుంబ యజమానులుగా గుర్తిస్తూ రేషన్ కార్డులు అందజేయుగా.. కొత్త రాష్ట్రంలో.. కొత్త సర్కారు మహిళల పేరిట ఆహార భద్రతా కార్డులు అందజేయనుంది.
 
 ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయుం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. కుటుంబ యజమానుల స్థానంలో మహిళలపేర్లను చేరుస్తూ జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్న మైంది. మెట్టినింట ఇన్నాళ్లూ ఇల్లాలిగా .. తల్లిగా పలు పాత్రలు పోషిస్తూ వచ్చిన మహిళలు ఇకమీద అధికారికంగా కుటుంబ యజమానులపాత్రలో ఒదిగిపోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదటిసారిగా మహిళల పేరిట ‘ఇందిరమ్మ’ గృహాలు మంజూరు చేయగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు నిర్ణయంతో పూర్తి స్థాయిలో మహిళలు కుటుంబ యజమానుల అవతారమెత్తనున్నారు.  
 
 బియ్యంతో కలిపి మూడు సరుకులే...
 అమ్మహస్తంపేరుతో గత ప్రభుత్వం సరఫరా చేసిన తొమ్మిది రకాల సరుకులకు ఇక స్వస్తి పలికారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక వ్యక్తికి ఇచ్చే నాలుగు కిలోల బియ్యం స్థానంలో ఆరు కిలోలు ఇవ్వనుండగా బియ్యంతోపాటు చక్కెర, కిలో కంది పప్పుకలిపి మూడు రకాల సరుకులు మాత్రమే ఆహారభద్రతా పథకంలో సరఫరా చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement