సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండిలా..
ప్రయోజనం..
తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఆహారభద్రత కార్డులు, పింఛన్లు, కుల, ఆదాయు, నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనుంది. సదరు కార్డులు, పత్రాల కోసం సోవువారం నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆహార భద్రత కార్డుల కోసం స్థానిక రేషన్ షాపులు, పింఛన్, కుల, ఆదాయు, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయుం 10.30 నుంచి సాయుంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకొని, విధిగా రశీదు పొందాలి. తెల్లకాగితంపై రాసి దరఖాస్తు సమర్పించాలి. ఆధార్‌కార్డు లేనివారు ఆ కార్డు కోసం నమోదు చేసుకున్న రశీదును జతపరచాలి. ప్రతి కౌంటర్‌లో అన్ని రకాల దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపిన తరువాత అర్హులైన వారికి ఆహార భద్రత కార్డులు మంజూరైనట్టు లబ్ధిదారుల మొబైల్స్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందజేస్తారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా