సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపీ కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1.5 శాతం కరువు భత్యం(డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ జులై 1, 2017 నుంచి వర్తించనుంది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. పింఛన్ దారులకు కూడా ఈ డీఏ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సంబంధించి ఒక కరువు భత్యం (డీఏ)ను వెంటనే చెల్లిస్తాం. డీఏకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశానని, మరో డీఏను రెండు నెలల్లో చెల్లిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే డీఏను పెంచుతూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment