తుంగభద్ర బోర్డు పరిధిలోకి రాజోలిబండ మళ్లింపు పథకం! | Telangana government will appeal to to the Board | Sakshi
Sakshi News home page

తుంగభద్ర బోర్డు పరిధిలోకి రాజోలిబండ మళ్లింపు పథకం!

Published Thu, Nov 27 2014 1:03 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Telangana government will appeal to to the Board

బోర్డుకు విజ్ఞప్తి చేయనున్న తెలంగాణ సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య వివాదాస్పదంగా మారిన రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)ను తుంగభద్ర బోర్డు పరిధిలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్‌కు 15.84 టీఎంసీల నీటి కేటాయింపులున్నా... ఏనాడూ 3 టీఎంసీలకు మించి అందడం లేదు. దీంతో రాష్ట్రంలో ఆర్డీఎస్ కింద ఉన్న 87 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.

దీనిని నివారించి కర్ణాటకలో నదీ ప్రవాహ ప్రాంతంలోని కాలువల మరమ్మతులు, గట్ల పటిష్టం, పూడికతీతకు సంబంధించి ఆ రాష్ట్రంతో గతంలోనే ఒప్పందాలు జరిగినా అవి పూర్తి స్థాయిలో అమలుకావడం లేదు. దీంతో ఈ ఏడాది ఆర్డీఎస్ కింద పంటలకు నీరు అందలేదు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఆర్డీఎస్‌ను బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 29న బెంగళూరులో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement