
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయనకు జర్మనీ, భారతీయ పౌరసత్వం ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై.. కోర్టు 8 వారాల పాటు స్టే విధించింది. ఈ క్రమంలో రమేష్ బాబు.. జర్మనీ పౌరసత్వాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. రమేష్ బాబు రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.