నేటి నుంచి అర్చకుల సమ్మె | Telangana Priests Demand Hike in Eages | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అర్చకుల సమ్మె

Published Thu, Jun 4 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

నేటి నుంచి అర్చకుల సమ్మె

నేటి నుంచి అర్చకుల సమ్మె

హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ దేవాలయాల అర్చక, ఉద్యోగుల సంఘం (తెలంగాణ మతైక అర్చక, ఆలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి) గురువారం (ఈ నెల 4) నుంచి తలపెట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఐకాస కన్వీనర్ గంగు భానుమూర్తి స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు.

డిమాండ్లపై పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందించని అధికారులు.. ప్రస్తుతం ఒక వర్గాన్ని చేరదీసి సమ్మెను నీరుగార్చేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి కొందరితో జరిపిన చర్చలు కుట్రపూరితమని, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement