సాక్షి, హైదరాబాద్: జనగాం జిల్లాలోని రఘునాథ్‌పల్లి మండలం బానాజీ పేట గ్రామానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ గవ్వల కృష్ణకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఫెలోషిఫ్ లభించింది. కృష్ణ ఫ్రాన్స్‌లోని స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీలో 2016 నుంచి పరిశోధకుడిగా పని చేస్తున్నారు. ఈయన సేవలను గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం లక్ష యూరోల ఫెలోషిప్(రూ.80 లక్షలు)ను ప్రకటించింది. కృష్ణ ఐఐఎస్‌ఈఆర్, పుణె నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఐఐటీ రూర్కీలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ), ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు.
గ్రామీణ నేపధ్యం, పేదరికం నుంచి వచ్చిన కృష్ణకు ఈ అవార్డు రావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు, ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ ప్రాథమిక విధ్యను స్థానిక ప్రభుత్వ స్కూల్‌లోనే పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.