కేసీఆర్‌కు చేతకాకుంటే మేం చేసి చూపుతాం
కరెంటు కోతల నివారణపై ఎర్రబెల్లి, రేవంత్ సవాల
హైదరాబాద్: కరెంటు కొరతను తీర్చడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేతకాకుంటే తాము చేసి చూపిస్తామని టీడీపీ ముఖ్యనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. సోవువారం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్రస్టుభవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబును కలసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతుల కష్టాన్ని తీర్చకుండా, సమస్యలను పరిష్కరించకుండా, పాలించడం చేతకాక తవు పార్టీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా అటు కేంద్రంతోనూ, ఇటు ఇరుగుపొరుగు రాష్ట్రాలతోనూ గొడవలు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌తోపాటు కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్‌రావు తప్ప ఎవరూ సంతోషంగా లేరని రేవంత్ రెడ్డి విమర్శించారు.
జిల్లాల్లో పర్యటన
తెలంగాణలో రైతుల సమస్యలపై పోరుబాట పట్టాలని టీటీడీపీ నిర్ణయించింది. ఈ అంశంపై సోవువారం పార్టీ అధినేత చంద్రబాబుతో ముఖ్యనేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యనేతలంతా ఒకే వాహనంలో జిల్లాల వారీగా పర్యటించాలని నిర్ణరుుంచారు. స్థానిక సమస్యలపై ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలను నిర్వహించాలని నిర్ణయించారు.