జిల్లాలోని వివిధ ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది.
వర్గల్ (మెదక్ జిల్లా) : జిల్లాలోని వివిధ ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది. మెదక్ జిల్లా వర్గల్లో మొన్న నాచగిరీశునికి ముడుపు కట్టి వినూత్న రీతిలో నిరసన గళం వినిపించిన నాచగిరి అర్చక సిబ్బంది, నిన్న గోపురమెక్కి, రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో చేశారు. మంగళవారం ఆలయ మండపంలోని గర్భగుడి ముందు మోకాళ్లపై కూర్చుని ఆందోళన కొనసాగించారు.
ప్రభుత్వం తమను కరుణించేలా చూడాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా కటాక్షించాలని నాచగిరీశుని మొక్కుకున్నారు. నిరసన కార్యక్రమం అర్చక, ఉద్యోగ సంఘ నేతలు గోపాలకృష్ణ శర్మ, రంగాచారి, సుధాకర్‌గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచారి, జగన్నాథచారిల నేతృత్వంలో కొనసాగింది.