సబ్సిడీ ఉల్లి కోసం జనాలు బారులు | The crowds queuing for subsidized onion | Sakshi
Sakshi News home page

సబ్సిడీ ఉల్లి కోసం జనాలు బారులు

Published Fri, Aug 28 2015 2:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

సబ్సిడీ ఉల్లి కోసం జనాలు బారులు - Sakshi

సబ్సిడీ ఉల్లి కోసం జనాలు బారులు

♦ క్యూలైన్‌లో గంటల కొద్దీ నిరీక్షణ
♦ నాలుగు కిలోలు పంపిణీ చేయాలని డిమాండ్
 
 మేడ్చల్ : ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేస్తున్న ఉల్లి కోసం మేడ్చల్ రైతుబజార్‌లో ప్రజలు బారులు తీరుతున్నారు. ఉల్లి ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో రూ.20 చొప్పున పంపిణీ చే స్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగా మేడ్చల్ రైతుబజార్‌లో ఆగస్టు 5న ఉల్లి సబ్సిడీ కేంద్రాన్ని ప్రారంభించింది. నిత్యం ఈ కేంద్రంలో 2 వేల కిలోల ఉల్లిని సబ్సిడీపై విక్రరుుస్తుండగా, ఇప్పటి వరకు దాదాపు 350 క్వింటాళ్ల ఉల్లిని విక్రయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ కుటుంబానికి 15 రోజులకు ఒక సారి రెండు కిలోల చొప్పున ఉల్లిని అందిస్తున్నట్లు వారు వివరించారు. ఉల్లి ధరలు వూర్కెట్‌లో అదుపులోకి వచ్చేంత వరకు విక్రరుుస్తావుని రైతుబజార్ సూపర్‌వైజర్ రమేష్‌కువూర్ తెలిపారు. నాణ్యత లేని ఉల్లిగడ్డను తిరిగి పంపుతున్నావున్నారు.  
  నాలుగు కిలోలు సరఫరా చేయాలి
 ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న రెండు కిలో ఉల్లి గడ్డలు వారానికి సరిపోవడం లేదు. ప్రభుత్వం అవసరాలను గుర్తించి నాలుగు కిలోలను సరఫరా చేయాలి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు  చొరవ చూపాలి.
 - ఎస్ సోనీ, మేడ్చల్
 
 కుళ్లిన ఉల్లిగడ్డలు వస్తున్నారుు
 సబ్సిడీపై సరఫరా చేస్తున్న ఉల్లిగడ్డల్లో కుళ్లినవి సరఫరా చేస్తున్నారు. ఎందు కు ఇలా సరఫరా చేస్తున్నారంటే.. నిర్వాహకుల నుంచి సమాధానం రావడం లేదు. మంచి గడ్డలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
 - యుసూఫ్ ఉన్నీసా
 
 వసతులు కల్పించాలి
 సబ్సిడీతో ఇస్తున్న ఉల్లి పంపిణీ కేంద్రం వద్ద కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. గంటల తరబడి క్యూలో నిల బడాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
 - సత్తెవ్ము
 
 కుళిన్ల ఉల్లిని తీసేస్తున్నాం
 దిగువుతి చేసుకున్న ఉల్లిగడ్డను నేరుగా విక్రరుుంచకుండా వాటిలో వూర్కెట్‌లోని స్టాల్స్‌లో ఆరబోసి ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసి కుళ్లిన ఉల్లిని ఏరివేసి విక్రరుుస్తున్నాం. నాణ్యత లేని సరుకును తిరిగి వెనక్కి పంపిస్తున్నాం.
 - రమేష్‌కువూర్,రైతుబజార్ సూపర్‌వైజర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement