అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
- ప్రజల కోసం పని చేసేదే ప్రభుత్వం
- అసెంబ్లీలో అంశాలపై స్పీకర్‌దే నిర్ణయం : గవర్నర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ప్రజల కోసం పని చేసేదే ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. పౌరులుగా అందరం కలిసి కృషి చేయాలి. నేను, మీరు అని కాకుండా.. మనం అనేలా ఉండాలి’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. చెరువుల పరిరక్షణకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల వరంగల్ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లే ముందు బుధవారం హన్మకొండలో గవర్నర్ విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీకి సంబంధించి ఎలాం టి అంశమైనా స్పీకర్‌దే తుది నిర్ణయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘వరంగల్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1972లో నేను నర్సంపేట ఏఎస్పీగా పని చేశాను. ఇప్పుడు గవర్నర్‌గా రావడం ఆనందంగా ఉంది. ’ అని చెప్పారు. గవర్నర్ దంపతులు హన్మకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.