వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్
10న కామారెడ్డిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష
సంగారెడ్డి క్రైం : తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి ఈనెల 10న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ తెలిపారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ర్ట ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వకపోవడం వల్లనే వారు బలవన్మరణాల బాట పడుతున్నారని, వారి కుటుంబాలను సైతం ఆదుకోవడంలో ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో 180 మంది రైతులకు పైగా ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకర మన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు.
దీక్షకు జిల్లాలోని కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, ముఖ్య నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రాష్ర్ట ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఎం.మక్సూద్, జిల్లా సంయుక్త కార్యదర్శులు, బాగన్నగౌడ్, కృష్ణారెడ్డి, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలం
Published Fri, May 8 2015 12:44 AM | Last Updated on Mon, Oct 1 2018 4:42 PM
Advertisement
Advertisement