►ఆరుగురి వద్ద తలా రూ.10వేలు
►డిమాండ్ చేసిన ఓ నాయకుడు
►లేఖ అందజేసిన క్లర్క్ సస్పెన్షన్
యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : యువ ఉద్యోగుల బదిలీ లేఖను అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసిన ఓ నాయకుడి వవ్యవహారం ఆర్జీ-2లో చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లికి చెందిన ఆరుగురు యువ కార్మికులు ఆర్జీ-2 వీటీసీలో శిక్షణ పొందారు. జీడీకే-7ఎల్‌ఈపీ గనిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత వకీల్‌పల్లిగనికి పోస్టింగ్ ఇచ్చా రు. శిక్షణ పూర్తయ్యాక భూపాలపల్లికి బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ ఈపీఆర్ ఆప్‌డేట్ కోసం ఇక్కడే పనిచేయాలని ఆదేశాలివ్వగా 15 రోజులుగా ఇక్కడే పనిచేస్తున్నారు. వారు తమ ఏరియాకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకోవడంతో కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఆ కాపీపై ఏరియూ జీఎం విజయపాల్‌రెడ్డి సంతకం చేసి గనికి పంపించాలని పర్సనల్ విభాగానికి సూచించారు. అయితే కాపీ ఈనెల 16న సాయంత్రం వకీల్‌పల్లిగనికి చెందిన ఓ యూనియన్ నాయకుడి చేతికి వెళ్లడం తో గురువారం తన వద్దే ఉంచుకున్నాడు.
తమ వల్లే బదిలీ అరుుందని, తలా రూ.10వేలు తీసుకురావాలని సదరు యువ కార్మికులతో బేరానికి దిగినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బాధిత కార్మికులు విషయాన్ని హెచ్‌ఎంఎస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు గని మేనేజర్, సంక్షేమ అధికారి వద్దకు వెళ్లి నిలదీశారు. వ్యవహారం బయటపడడంతో ఆ నాయకుడు బదిలీ కాపీని శుక్రవారం సంక్షేమ అధికారికి అందజేశాడు. దీంతో విషయూన్ని జీఎం సీరియస్‌గా తీసుకున్నారు. గనిపైకి వెళ్లాల్సిన ట్రాన్స్‌ఫర్ లేఖను నిబంధనల కు విరుద్ధంగా నాయకుడి చేతికి ఇచ్చిన పర్సనల్ విభాగం క్లర్క్‌ను 10 రోజులపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ అధికారి, సంబంధిత అధికారులతో లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు.
బదిలీ లేఖతో బేరం
Published Sat, Mar 19 2016 2:56 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM
Advertisement
Advertisement