కొరవి మండలం నల్లెల గ్రామశివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కర్ర లతో కొట్టి చంపారు. సూర్యతండాకు చెందిన అజ్మీరా సురేష్(34) కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మిరప కల్లెం వద్ద భార్యభర్తలిద్దరూ కలిసి మంగళవారం రాత్రి కాపలా ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలిసిన గ్రామస్తులు తీవ్రగాయాలపాలైన సురేష్‌ను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో వ్యక్తి మృతి
Published Wed, Mar 9 2016 2:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement