
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి
తెలంగాణ వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
హైదరాబాద్ : పత్తిరైతులను కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలంగాణ వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పత్తి పంటకు గిట్టుబాటుధర కల్పించాలని, పత్తిరైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన కోరారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు జనక్‌ప్రసాద్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుపెట్టలేదన్నారు. ప్రభుత్వం క్విటాల్‌కు రూ.4,050 ధర ఇస్తోందని, ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కాదన్నారు. దళారులు రూ. మూడు వేలు మాత్రమే ధర చెల్లిస్తున్నారన్నారు. ఇటువంటి విషమ పరిస్థితులు కొనసాగితే రైతుల ఆత్మహత్యలు తప్పవన్నారు. దివగంత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు పత్తి క్వింటాల్‌కు రూ.7వేలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
ఖర్చుకు ఒకటిన్నరరెట్లుండాలి: స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం, పంటకు ఖర్చుపెట్టిన దానిపై కనీసం ఒకటిన్నర రెట్లు గిట్టుబాటుధరలు ఉండాలని జనక్‌ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం క్వింటాల్ పత్తి కోసం పెట్టుబడి ఖర్చు రూ.5,200 అవుతుందని, ఈ విధంగా గిట్టుబాటుధర వచ్చే విధంగా పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. ఖర్చులు, కొనుగోళ్లలో రైతులు లాభపడేలా చూడాలన్నారు. పత్తి ఎగుమతులకు అనుమతులు ఇస్తామని ప్రధాని మోడీ చెప్పారని, అది అమలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చేందుకు పాలకపక్షాలు కృషి చేయాల న్నారు. కాగా, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలోని విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లా లు, ఇతర తుఫానుప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ను ఆదుకోవడానికి తెంగాణ వైఎస్సార్‌సీపీ శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని పొంగులేటి, జనక్‌ప్రసాద్‌లు చె ప్పారు.