90 పీజీ ఇంజనీరింగ్, 32 ఫార్మసీ కాలేజీలే స్పందించాయి
ఇంకేమైనా లోపాలున్నాయో లేదో తేల్చాలి
అక్టోబర్ 16 వరకు గడువు కావాలన్న ఏజీ
అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి
హైదరాబాద్: ధర్మాసనం ఆదేశాల మేరకు చట్టం నిర్దేశించిన విధంగా ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయో తెలియజేయాలంటూ 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలకు నోటీసులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. 90 పీజీ ఇంజ నీరింగ్, 32 పీజీ ఫార్మసీ కాలేజీలు వివరాలు సమర్పించాయని ఆయన తెలిపారు. వివరాలు సమర్పించిన కాలేజీల్లో ఇంకా ఏవైనా లోపాలున్నాయా అన్న విషయాన్ని తేల్చేం దుకు వచ్చే నెల 16 వరకు గడువు కావాలని ఆయన కోర్టు ను అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ మెమోను కోర్టు ముందుంచారు. ఈ మెమోను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి.. ఏజీ కోరిన విధంగా వచ్చే నెల 16వ తేదీ వరకు గడువునిచ్చారు. తదుపరి విచారణను ఆ రోజుకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం జరిగే వెబ్ కౌన్సెలింగ్ జాబి తాలో తమను చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ రాజశేఖరరెడ్డి.. హైకోర్టును ఆశ్రయించిన అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ ఈ నెల 4న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కాస్త సవరించి.. లోపాలను సరిదిద్దుకోలేదని చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలను సైతం ప్రాథమిక కౌన్సెలింగ్‌లో చేర్చాలని, అయితే ఈ కాలేజీల విషయంలో సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం వెలువరించేంత వరకు ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దని ఈ నెల 9న జేఎన్‌టీయూను ఆదేసించింది. దీంతోపాటు కౌన్సెలింగ్ జాబి తాలో చేర్చాలంటూ దాఖలైన వ్యాజ్యాల్లో తుది విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ మొదలు పెట్టిన జస్టిస్ రాజశేఖరరెడ్డి వాటిని సోమవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఏజీ అడిగిన మేరకు గడువునిస్తూ.. విచారణను వాయిదా వేశారు.
ధర్మాసనం చెప్పినట్లు నోటీసిచ్చాం
Published Wed, Sep 24 2014 12:29 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement