విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపుఇస్తున్నట్లు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కినక సురేశ్ తెలిపారు.
ఎదులాపురం : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపుఇస్తున్నట్లు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కినక సురేశ్ తెలిపారు. మంగళవారం ప్రింట్ మీడి యా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు, తగిన నిధులను కేటాయించాలన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల గుర్తింపును రద్దు చేసి ఫీజులు నియంత్రించాలన్నారు. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర ఖాళీలను వెంటనే శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల10న తలపెట్టిన బంద్‌కు విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు దర్శనాల అశోక్, నాయకులు కుర్సెంగే సంతోష్, దత్తు, రాకేశ్, ఉపేందర్ పాల్గొన్నారు.