
ట్రాక్టర్ కొంటున్నారా.. సరే చదవండి
- మరమ్మతులు విస్మరించొద్దు
- నిర్వహణపై అవగాహన అవసరం
- నిత్యం చెక్ చేయాలి
జగిత్యాల అగ్రికల్చర్ : పంటలసాగులో ట్రాక్టర్ల పాత్ర ఇప్పుడు కీలకం. కూలీల కొరత, సమయం ఆదా.. ఖర్చు తక్కువ, పంట పంటకు మధ్య తక్కువ వ్యవధి ఉండటం దీనికి కారణాలు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు సైతం ట్రాక్టర్లను కొంటున్నాడు. కానీ వాటి నిర్వహణలో, చిన్న సవుస్యలను విస్మరిస్తూ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ట్రాక్టర్ల నిర్వహణ, పనితీరుపై పొలాస వ్యవసాయ కళాశాల ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. పద్మ పలు విషయూలు వివరించాడు.
నిర్వహణలోపంతో 25 శాతం డీజిల్ వృథా
రైతులు కొనే ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలి. ట్రాక్టర్‌ను ఏ రీతిలో వాడాలో, సక్రమంగా నడిపిందుకే ఏ ఏ పనులు చేయూలో చదువుకునేందుకు వీలుగా చిన్నపుస్తకాన్ని ఇస్తారు. అందులోని అంశాలను పాటించాలి. ట్రాక్టర్ నిర్వహణ సరిగ్గా లేకపోతే దాదాపు 25 శాతం డీజిల్ వృథా అవుతుంది.
ట్రాక్టర్ల నిర్వహణ
► ట్రాక్టర్ భాగాలను అప్పుడప్పుడు పరీక్షిస్తూ అవసరమైన వుర వ్ముతు చేయిస్త్తే వురింత కాలం వున్నికగా పనిచేస్తాయి.
►ట్రాక్టర్‌తో నిరంతరం పనిచేయించే సమయంలో ప్రతి 10 గంటలకోసారి రేడియేటర్‌ను నీటితో నింపాలి.
► తగిన లెవల్‌వరకు ఆయిల్, టైర్లలో తగినంత గాలి ఉండాలి.
►అన్ని బోల్టులను, నట్లను గట్టిగా బిగించాలి.
►వారానికోసారి బ్యాటరీలోని ఆసిడ్ వుట్టం సరిచూడాలి. ప్యాన్ బెల్టు బిగవుగా ఉండాలి.
►నెలకోసారి అన్ని గ్రీజు నిప్పల్స్‌లో గ్రీజు నింపాలి. ప్యూయుల్ ఫిల్టర్లు, ఇంజిన్ ఆయిల్ వూర్చాలి.
►ఏడాదికోసారి ముందు, వెనుక చక్రాల ఆక్సిల్ బేరింగ్‌లను తీసి శుభ్రపరిచి తిరిగి అవుర్చాలి.
►రేడియేటర్ నుంచి నీటిని తీసేసి, శుభ్రంగా కడిగి తిరిగి నీటితో నింపాలి.
►ఇంజిన్ వాల్వులు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి బావెట్ క్లియురెన్స్ సరిచేయాలి. సరైన గ్రేడ్ ఇంజినాయిల్ వాడాలి.
►ఆయిల్ పంపులో తగినంత ఆయిల్ ఎప్పుడూ ఉంచాలి.
►స్టార్టరు స్విచ్ సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షించాలి.
►ఆయిల్ గేజ్, టెంపరేచర్ గేజ్, స్పీడోమీటర్, బ్యాటరీ చార్జింగ్ గేజ్ సరిగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించాలి.
ఎదురయ్యే సమస్యలు
► ట్యాంకులో డీజిల్ లేకపోవడం లేదా ఇంధనం గొట్టంలో దూళి, వులినపదార్థాలు చేరి లేదా ఫ్యూయుల్‌ఫిల్టరులో వుట్టిచేరి ఇంజిన్ స్టార్ట్ కాదు.
►అందుకే గొట్టాలను.. ఫిల్టరును విడదీసి శుభ్రపరచాలి.
►గేర్ బాక్స్‌లో ఆయిల్ తక్కువ ఉండటం లేదా సరైన గేజ్ ఆయిల్‌వాడకపోవడం వల్ల లేదా గేర్లు అరిగిపోవుటం వల్ల గేర్లు మారిస్తే శబ్దం వస్తుంది. కొత్తగేర్లు, సరైన గ్రీజ్ ఆయిల్ వాడాలి.