యాచారం : పీఏసీఏస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే విషయంలో బలం సమకూర్చుకోవడానికి టీఆర్‌ఎస్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. టీఆర్‌ఎస్ అవిశ్వాసం పెట్టినా నెగ్గే విధంగా కాంగ్రెస్ పార్టీ మంతన్‌గౌరెల్లి డెరైక్టర్ కరంటోతు పాం డు(టీడీపీ)ని శుక్రవారం రాత్రి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్చుకుంది. దీన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్ నాయకులు శనివారం ఉదయం పాండును తమ శిబిరం వైపు తిప్పుకొని ఏకంగా టీఆర్‌ఎస్‌లో చేర్చు కున్నారు.
అంతకు ముందు శనివారం మధ్యాహ్నం పీఏసీఏస్ డెరైక్టర్ పాండు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎంపీటీసీ సభ్యు డు కొర్ర అరవింద్ నాయక్, నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్ఛ భాషా విలేకరులకు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ విలేకరులకు ఫోన్ చేసి పాండు కాంగ్రెస్ లో చేరలేదని, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ లో చేరినట్లు చెప్పారు. పాండుతో కూడా ఫోన్లో విలేకరులతో మాట్లాడించారు.
క్యాంపులకు సిద్ధం
చైర్మన్ పీఠాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్, చైర్మన్ పీఠాన్ని దక్కించుకోడానికి టీఆర్‌ఎస్ ఎత్తుగడలు వేస్తున్నా యి. వారంరోజులు పాటు తమ శిబి రంలో ఉండి టీఆర్‌ఎస్‌లో చేరిన మంత న్ గౌరెల్లి డెరైక్టర్ తీరుతో ఆందోళన చెందిన కాంగ్రెస్ అప్రమత్తం కాగా ఏడుగురు సభ్యులతో ముందు చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేలా టీఆర్‌ఎస్ చకచకా పావులు కదుపుతోం ది. శనివారం నగరంలో టీఆర్‌ఎస్ శ్రేణు లు సమావేశమై క్యాంపుల విషయమై చర్చించారు. కాంగ్రెస్‌శ్రేణులు కూడా పీఠం చేజారకుండా జాగ్రత్త చర్యలు మొదలుపెట్టాయి.
రాత్రి కాంగ్రెస్‌లోకి.. ఉదయం టీఆర్‌ఎస్‌లోకి.!
Published Sun, May 17 2015 12:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM