
చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును A-1 ముద్దాయిగా చేర్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని యాదవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కేసు నుంచి బయటపడేందుకు సహకరించలేదనే భావనతోనే గవర్నర్ నరసింహన్పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇదే గవర్నర్ను కొనసాగించాలని టీడీపీ నేతలు కోరారనే విషయాన్ని యాదవరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబే గందరగోళం సృష్టిస్తున్నారని యాదవరెడ్డి మండిపడ్డారు.