నల్గొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ విజయవిహార్ లో మూడు రోజుల పాటు జరిగిన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. టీఆర్ఎస్ చేపట్టిన శిక్షణా తరగతుల్లో ప్రధానంగా 10 అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇచ్చారు.
దీనిలో భాగంగానే చివరి రోజులన జడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాగార్జనసాగర్ బౌద్ధరామానికి ప్రత్యేక అథారిటి ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.