టీఆర్‌ఎస్ తొలి జాబితా అభ్యర్థులు వీరే! | TRS to releases first list of candidates for Assembly polls! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ తొలి జాబితా అభ్యర్థులు వీరే!

Published Sat, Mar 15 2014 11:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

టీఆర్‌ఎస్ తొలి జాబితా అభ్యర్థులు వీరే! - Sakshi

టీఆర్‌ఎస్ తొలి జాబితా అభ్యర్థులు వీరే!

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం సాయంత్రం ఆపార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం సాయంత్రం ఆపార్టీ అభ్యర్ధుల  మొదటి జాబితాను విడుదల చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటన చేస్తారు. తొలి జాబితాలో  సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి అవకాశం కల్పించనున్నారు.

ఆదివారం  రెండో జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గలు తెలిపాయి. కాగా పొత్తులపై స్పష్టత రాకముందే కేసీఆర్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే టీఆర్ఎస్తో పొత్తు వద్దని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడంపై కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. పొత్తులపై కూడా ఆయన తన వైఖరిని వెల్లడించనున్నారు.

తొలి జాబితాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు
సిద్దిపేట- హారీశ్‌రావు
సిరిసిల్ల- కేటీఆర్
సిర్పూర్ కాగజ్‌నగర్-కావేటి సమ్మయ్య
చెన్నూరు- ఓదేలు
యల్లారెడ్డి -ఏనుగు రవీందర్ రెడ్డి
కామారెడ్డి- గంపాగోవర్థన్
ఆదిలాబాద్- జోగు రామన్న
ముదోల్ -వేణుగోపాలచారి
కోరుట్ల- విద్యాసాగర్ రావు
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
రామగుండం -సోమారపు సత్యనారాయణ
హుజురాబాద్ -ఈటెల రాజెందర్
పరకాల- బిక్షపతి
వరంగల్ వెస్ట్- వినయ్ భాస్కర్
కరీంనగర్- గంగుల కమాలాకర్
కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
తాండూర్- మహేందర్ రెడ్డి
పరిగి -హరీశ్వర్‌రెడ్డి
చేవెళ్ల -రత్నం
డోర్నకల్ -సత్యవతి రాథోడ్
జూక్కల్ - హన్మంత్ షిండే
బాన్సువాడ -పోచారం శ్రీనివాస రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్- రాజయ్య
మక్తల్- యల్లారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement