సాక్షి, యాదగిరిగుట్ట: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో గత రెండు రోజులుగా ఉత్కంఠత నెలకొంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న అష్టభుజి ప్రాకార మండపం స్తంభాలపై కేసీఆర్, హరితహారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, కారుగుర్తు మొదలైనవి చెక్కడంతో తీవ్ర దుమారం రేగింది. దేవాలయంలో వ్యక్తులు, పార్టీ గుర్తులు పెట్టడంమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు యాదాద్రిలో ఆందోళన చేపట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక భారీ ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వివాదాలకు కారణమైన కేసీఆర్ బొమ్మ సహా అన్ని బొమ్మలు తొలగిస్తామని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు శనివారం సాయంత్రం వెల్లడించారు. ఇక భారీ పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. యాద్రాద్రి కొండపైకి మీడియాను అనుమతించలేదు.
(చదవండి : మండపాల్లో కేసీఆర్ బొమ్మ చెక్కడంపై నిరసన)
యాదాద్రి : కేసీఆర్ బొమ్మపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం
Published Sat, Sep 7 2019 9:03 PM | Last Updated on Sat, Sep 7 2019 9:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment