సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల రాత పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 8 మీడియాలకు సంబంధించిన 82,537 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటిం చింది. వాటిని తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. హాల్‌టికెట్ నంబర్, బుక్‌లెట్ సిరీస్ వంటి వాటికి సంబంధించి తప్పుడు బబ్లింగ్ చేసిన వారిని రిజెక్ట్ చేశామని, మెరిట్ జాబితాలో చేర్చలేదని పేర్కొంది. కోర్టును ఆశ్రయించి, జాబితాలో చేర్చాలని కోర్టు ఇచ్చిన వారి పేర్లను మాత్రమే చేర్చామని వెల్లడించింది. కోర్టు తుది తీర్పునకు లోబడి వారి ర్యాంకింగ్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రెండు, మూడు రోజుల తర్వాత జిల్లాల వారీగా ఆయా కేటగిరీల్లో పోస్టులకు 1:3 రేషియోలో అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాల్లో వెరిఫికేషన్ చేపట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. వెరిఫికేషన్‌కు 1:3 రేషియోలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపించేలా టీఎస్‌పీఎస్సీ సిద్ధం చేస్తోంది.
అభ్యర్థుల వివరాలిలా..
మీడియం అభ్యర్థులు
తెలుగు 52,452
ఇంగ్లిష్ 27,924
ఉర్దూ 2,033
కన్నడ 54
మరాఠీ 44
హిందీ 28
బెంగాళీ 1
తమిళ్ 1
ఎస్‌జీటీ ఫలితాలు విడుదల
Published Tue, Jun 26 2018 3:41 AM | Last Updated on Sat, Sep 15 2018 8:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment