మెదక్‌రూరల్/రేగోడ్ : వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటి పోవడం, ఏ యేడు కు ఆ యేడు పంట పెట్టుబడులు పెరిగి పోవడం, చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ప్రకటన అన్నదాతల్లో ఎటువంటి భరోసా ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే మార్గం జిల్లా గురువారం మరో ఇద్దరు బలవన్మరణం పొందారు.
వివరాలిలా ఉన్నాయి.. మెదక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన దుర్తి యాదయ్య (28) తనకున్న 1.35 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతంలో ఒకబోరు వేయగా అందులో నీరు పడలేదు. ఇటీవల కాలంలో అప్పు చేసి మరో బోరును తవ్వించాడు. అందులో కొద్దిపాటి నీరు రావడంతో మెదక్‌లోని ఓ బ్యాంక్‌లో బోరు మోటార్ కోసం రూ. 60 వేల రుణం పొందాడు. అనంతరం బోరును దింపినా నీరు మా త్రం రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు.
ఈ నేపథ్యంలో పంటరుణం కోసం మరో రూ.50 వేలను బ్యాంకులోనే పొందాడు. అంతేకాకుండా కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ సుమారు రూ.65 వేలు అప్పులు చేశాడు. ఇలా మొత్తం అప్పురూ.1.75 లక్షలకు చేరిం ది. పంటలు పండకపోవడం, తెచ్చిన రు ణాలకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. ఆ రైతుకు ఆత్మహత్య తప్ప మరో మార్గం కనపడలేదు.
దీంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసునమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య కరుణ, ఐదేళ్ల కొడుకుతో పాటు వృద్ధ తల్లిదండ్రులు సిద్దయ్య, రాజవ్వలున్నారు.
ఎవరి కోసం బతకాలయ్యా...
అప్పులబాధభరించలేక దుర్తి యాదయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకోగా కూలీ పని నిమిత్తం వెల్లిన అతని భార్య కరుణ విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన ఆమె గుండెలు బాదుకుంది.నువ్వులేక నేనింకెవరి కోసం బతకాలయ్య అంటూ యాదయ్య భార్య విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. గ్రామంలో అందరితో కలుపుగోరిగా ఉండే యాదయ్య ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో పాతూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
పురుగు మందుతాగి..
అప్పులబాధలు ఆ రైతును ఆత్మహత్య వైపు పురిగొలిపాయి. రేగోడ్ మండలం జగిర్యాల గ్రామానికి చెందిన మన్నే శ్రీనివాస్ (31) తనకున్న ఏడెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయం చేయడానికి మూడేళ్ల కాలంలో సుమారు ఆరు బోర్లు వేశాడు. అయితే వీటిల్లో రెండు బోర్లలో నీరు కొద్దిపాటిగా ఉండడంతో వరి పంటను సాగు చేశాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ, బోర్ల తవ్వకానికి, ఇతర అవసరాలకు సమారు రూ. 2 లక్షలకు పైగా అప్పుచేశాడు.
ఈ నేపథ్యంలో పంట దిగుబడి రాక పోగా అప్పులు పెరగడంతో కలత చెందాడు. గురువారం పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్ చెప్పారు.
ఇద్దరు రైతుల బలన్మరణం
Published Fri, Jan 2 2015 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement