రెండు విడతల్లో ‘స్థానికం’
- 8న వరంగల్ డివిజన్‌లో.. 6న మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు
- 20 చెక్‌పోస్టుల ఏర్పాటు
- ఇప్పటివరకు రూ.59 లక్షల నగదు పట్టివేత
- కలెక్టర్ జి.కిషన్ వెల్లడి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలను జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ తెలిపారు. జిల్లాలో ఏఐఈఈఈ పరీక్షలతోపాటు ఇతర ఎన్నికలు ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏప్రిల్ ఆరు, ఎనిమిదో తేదీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యలు, ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, వరంగల్ డివిజన్‌లో ఎనిమిదిన, మిగతా డివిజన్లలో ఆరో తేదీన నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 8న శ్రీరామనవమి పర్వదినం ఉన్నప్పటికీ పోలింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండవని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికలకు సు మారు 14,500 సిబ్బం ది అవసరముంటుం దనే అంచనాతో ఎంపి క చేసినట్లు తెలిపారు. జిల్లా లో వివిధ శాఖల ప్రభు త్వ ఉద్యోగులు మొత్తం 40 వేలకు పైగా ఉన్నందున... ఎన్నికల విధుల కేటాయింపులో ఇబ్బందు లు ఉండవని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ పకడ్బం దీగా అమలు చేసేం దుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. మొత్తం 5,220 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమవుతాయని, వీటిలో మూడు వేల బాక్స్‌లను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల సందర్భంగా 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు రూ.59 లక్షల నగదు పట్టుకున్నట్లు వివరించారు. జిల్లాలో జరుగుతున్న మూడు రకాల ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీలు ప్రచారంలో వినియోగించే వస్తువుల ధరలు త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. చెల్లింపు వార్తా కథనాలపై సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం నడుచుకుంటామని కలెక్టర్ చెప్పారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయిలు పాల్గొన్నారు.