సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రభు త్వం ఆమోదం తెలిపిన 1,061 పోస్టులను జూన్‌లోగా భర్తీ చేయాలని ఓవైపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించడం.. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రోస్టర్ కమ్ రిజర్వేషన్ విషయంలో కొత్త నిబంధనలు తేవడంతో వర్సిటీ అధికారులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. పోస్టుల భర్తీలో కచ్చితంగా కొత్త రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని యూజీసీ పేర్కొనడంతో ఇప్పుడేం చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు.
ఇప్పటివరకు వర్సిటీ యూనిట్‌గా పోస్టుల భర్తీలో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేస్తున్నాయి. అది సరికాదని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దానిపై యూజీసీ ఉన్నత స్థా యి కమిటీని ఏర్పా టు చేసి అధ్యయనం చేయించింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు వర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టు వారీగా, డిపార్ట్‌మెంట్ వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమ లు చేయాలని యూజీసీ ఈ నెల 5వ తేదీన అన్ని వర్సిటీలకు ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీని ఎలా చేపట్టాలన్న ఆలోచనలో అధికారులు పడ్డారు. సబ్జెక్టు, డిపార్ట్‌మెంట్ వారీగా రోస్టర్‌ను రూపొందించడం, న్యాయ వివాదాలు తలెత్తకుండా చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
నెలాఖరులోగా నోటిఫికేషన్ల జారీ అసాధ్యం!
డిమాండ్ ఉన్న డిపార్ట్‌మెంట్లలోనే పోస్టులను భర్తీ చేసుకోవాలని, అవసరం లేని డిపార్ట్‌మెంట్ల నుంచి పోస్టులను అవసరం ఉన్న డిపార్ట్‌మెంట్లకు మార్పు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ పరిస్థితుల్లో పోస్టుల కన్వర్షన్, కొత్త రోస్టర్ విధానం రూపొందించి, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాదన్న భావనకు వర్సిటీలు వచ్చాయి.
రోస్టర్ అమలు చేయాల్సిందే
Published Mon, Mar 19 2018 1:46 AM | Last Updated on Mon, Mar 19 2018 1:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment