
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,యాదాద్రి : యూరియా కొరతతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పది రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలకు పంటలకు యూరియా పెట్టేందుకు రైతులు ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే కంపెనీల నుంచి సరఫరా తగ్గడంతో కొరత ప్రారంభమైంది. ఆడపాదడపా వస్తున్నప్పటికీ ఏమూలకు సరిపోవడం లేదు. దీంతో రైతులు పొరుగున గల జనగామ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు వెళ్తున్నారు.
యూరియా వాడకం ఎక్కువ
ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన తొలకరి వానలకు రైతులు పత్తి, వరి విత్తనాలు నాటారు. ఆ తర్వాత కరువు పరిస్థితులు కనిపించడంతో రైతులు ముందస్తుగా ఎరువులను కొనుగోలు చేయలేదు. అయితే పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎరువులు పెట్టడానికి రైతులందరూ ఒక్కసారిగా దుకాణాలకు వెళ్తున్నారు. దుకాణాల్లో అధిక నిల్వలు లేకపోవడం, కంపెనీల నుంచి దిగుమతి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. అందులో కాంప్లెక్స్ ధరలు అధికంగా ఉండడంతో యూరియా వాడకంపై ఎక్కువ దృష్టి సారించారు. ఒక్క బస్తాకు బదులుగా రెండు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు. దీంతో యూరియా కొరత అధికమైంది.
అడ్డొచ్చిన సెలవులు
యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు మిర్యాలగూడెం, హైదరాబాద్ నుంచి రైల్వే రాక్‌ల ద్వారా ఉమ్మడి జిల్లాలకు సరఫరా అవుతాయి. మిర్యాలగూడెం స్టాక్ పాయింట్‌కు రైల్ వ్యాగన్లలో వచ్చిన యూరియాను దుకాణాలకు చేరవేసేందుకు రెండో శనివారం, ఆదివారం కావడంతో లోడిం గ్‌లు కాలేదు. సోమవారం, మంగళవారాల్లో లోడింగ్ అయినప్పటికీ అతి తక్కువ లారీల్లో ఎక్కించారు. ట్రాన్స్‌పోర్ట్ నుంచి దుకాణాల్లోకి చేరడానికి సమస్య ఎదురైంది. బుధవారం స్వాతం త్య్ర దినోత్సవ సెలవు కావడంతో, యూరియా లోడింగ్ కాలేదు.
కేంద్రంనుంచి అందే సబ్సిడీ ఇలా..
కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం యూరియా అమ్మకం మీదనే సబ్సిడీ విధానం(డీబీటీ) ప్రవేశపెట్టింది. ప్రతి ఎరువుల దుకాణానికి పీలోఎస్ మిషన్ ద్వారా అమ్మకం చేస్తోంది. విక్రయించిన యూరియాకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. 50 కిలోల యూరియా బస్తాకు రైతు రూ.295 చెల్లిస్తుండగా, కేంద్రం అందించే సబ్సిడీ రూ.923.74. 45కిలోల యూరియా బస్తాకు రూ.266.53 రైతు ధర కాగా, కేంద్రం రూ.850 వరకు సబ్సిడీ చెల్లిస్తుంది.
అందని సబ్సిడీతో ఇబ్బందులు
డీలర్లు, వివిధ వర్గాల ద్వారా తెలుస్తున్న సమచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోవడంతో కంపెనీలు యూరియా తయారీని నిలిపివేశాయి. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన యూరియాను తమ కంపెనీల బస్తాల్లో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.ఈ యూరియా కూడా డీలర్‌కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్‌పోర్ట్ చార్జి పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడెం, హైదరాబాద్ ల్యాబ్‌లనుంచి అదనంగా కిరాయి బస్తాకు రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో డీలర్‌కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించి అవుతుంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రిబ్‌కో, స్పీక్ యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు కూడా యూరి యా సరఫరా చేస్తున్నాయి.
50వేల టన్నులు అవసరం
ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 50వేల టన్నుల యూరియా కావాలి.అంటే సుమారుగా 20వ్యాగన్‌ల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ఒక్క వ్యాగన్ మాత్ర మే జిల్లాకు రావడంతో ఉమ్మడి జిల్లా అవసరం మొత్తానికి సరఫరా చేయలేకపోతున్నారు.దీంతో తీవ్రమైన కొర త ఏర్పడుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే పంటలకు యూరియా అధికంగా అవసరం ఉంటుంది. ఈసమయంలోనే యూరి యా సరిపోను లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆందోళనలో రైతులు
జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతుండగా మరో వై పు ఆందోళన నెలకొంది. అదునుకు యూరి యా పెడితే చేను ఏపుగా పెరిగేదని, అధికా రులు వెంటనే స్పందించి సరిపడా ఎరువులు తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment