ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ: ఉత్తమ్‌ | uttam kumar reddy prices pv narasimha rao in he's death anniversery | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ: ఉత్తమ్‌

Published Sat, Dec 24 2016 2:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ: ఉత్తమ్‌ - Sakshi

ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశాన్ని పటిష్ట  ఆర్థికశక్తిగా నిలదొక్కుకునేలా చేసిన ఘనత దివంగత ప్రధాని పీవీ నర్సింహారావుదేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం పీవీ ఘాట్‌ వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివా ళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అని, తనకు వ్యక్తిగతంగా ఆయనతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అన్నారు. బహుభాషా కోవిదుడిగా, ప్రపంచంలోని మేధావుల్లో ఒకరైన పీవీ తెలుగువాడు కావడం మనకు గర్వకారణమన్నారు. గాంధీభవన్‌లోనూ పీవీ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. మల్లు రవి, తూర్పు జగ్గారెడ్డి, కుసుమ్‌కుమార్, ఇందిరాశోభన్‌ తదితరులు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement